POLITICS Apr 14

భారతీయ జనతా పార్టీలోకి నందమూరి హరిక్రిష్ణ కుటుంభం ...

ap politics

భారతీయ జనతా పార్టీలోకి నందమూరి హరిక్రిష్ణ కుటుంభం ...

చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల స్వార్ధ అవినీతి పరిపాలన తీరుపై విసుగు చెందిన నందమూరి హరికృష్ణ చంద్రబాబు తెలుగుప్రజలకు చేస్తోన్న ద్రోహాన్ని చూసి సహించలేక ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం . . !
అదే హరికృష్ణ కుటుంభం బీజేపీలో చేరిక గతంలో కూడా టీడీపీలో చంద్రబాబు పరిపాలనను వ్యతిరేకిస్తూ " అన్న టీడీపీ " పార్టీ పెట్టి వ్యూహాత్మక తప్పిదాల వల్ల అందులోనూ చంద్రబాబు కోవర్టులు పార్టీని బ్రష్టు పట్టించి హరికృష్ణను వెన్నుపోటు పొడిచి పార్టీని నిర్వీర్యం చేశారు . . 

అయినా కొన్ని కుటుంబ ఒత్తిడులు భువనేశ్వరి ద్వారా చంద్రబాబు జరిపిన రాజకీయ కుటిల ఎత్తుగడలలో మళ్లీ పార్టీకి దగ్గరవడం మళ్లీ మోసపోయి వెనక్కు రావడం జరిగింది, ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఎత్తుగడలకు బలిపశువు అయ్యాడు.

చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు రాజకీయాలతో మోసపోయిన తన తండ్రి తను తన కొడుకులకు జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కు బుద్ది చెప్పేందుకు ఇప్పుడు టీడీపీకి ప్రత్యామ్నాయంగా దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా పోరాడుతున్న మోడీ సారధ్యంలో బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నందమూరి హరికృష్ణ తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం బీజేపీ అధిష్టానం మరియు హరికృష్ణ కుటుంభం మధ్య పార్టీలో చేరిక విషయాన్ని పురందేశ్వరి గారు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం .

ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ లో బలమైన అభిమానులు కలిగిన హరిక్రిష్ణ కుటంబం దెబ్బకు టీడీపీ కకావికలం అవ్వకతప్పదు .